telugu navyamedia
రాజకీయ

గిన్నెస్ బుక్ లో “కుంభమేళా 2019”

Kumbh Mela 2019 Enters Guinness Book Of World Records
జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగిన కుంభమేళ  ఈసారి ప్రపంచ రికార్డు  సాధించింది . ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళ ఈసారి గిన్నెస్ రికార్డు లో నమోదు కావడం విశేషం . ఉత్తరపరదేశ్ లో గంగ , యమున , సరస్వతి నదుల సంగమ ప్రదేశమే  కుంభమేళ  స్నాన కేంద్రం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం ఈసారి కుంభమేళా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది . 
KumbaMela 2019
దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు చేశారు . ఈ పుణ్య కాలంలో స్నానమాచరించడం  ఎంతో అదృష్టంగా భావిస్తారు . ఈ కుంభమేళాకు వచ్చేవారి కోసం ఎన్నో స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు . భక్తులు సేదతీరడానికి టెంట్లు వేశారు . ఈసారి కుంభమేళాకు  24 కోట్ల  5 లక్షల మంది  వచ్చినట్టు మేళా నిర్వాహణాధికారి  విజయ్ కిరణ్ ఆనంద్  తెలిపాడు . 
కుంభమేళా చివరి రోజున అంటే మహాశివరాత్రి పర్వ దినం కావడంతో భక్తులు ఇసుక వేస్తె రాలనంత మంది వచ్చారని , 
ఈ ఒక్కరోజే కోటి 10 లక్షలు వచ్చినట్టు విజయ్  పేర్కొన్నాడు . భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆయన చెప్పాడు .
 
హిందువులు ఇలాంటి కుంభ మేళాలకు వెళ్లి త్రివేణి  సంగమ  క్షేత్రం లో తప్పకుండా స్నానమాచరిస్తారు . ఇది అనాదిగా వస్తున్న ఆచారం . భక్తులతో పాటు ఈ కుంభమేళాలో నాగా సాధువులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు . ఈ కుంభమేళా ను యోగి ఆదిత్యానాథ్  ప్రతిష్టాత్మకంగా తీసుకొని  మరీ ఏర్పాట్లు చేశాడు . 20,000 మంది రాష్ట్ర , కేంద్ర పోలీసులను విధుల్లో ఉంచారు .  40 పోలీస్ స్టేషన్లను అందులో మూడు మహిళా పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేశారు . 
KumbaMela 2019
సాయుధులైన పోలీసులతో 40  కేంద్రాలను  భక్తులు వచ్చే దారుల్లో 15 ఫైర్  అవుట్ పోస్టులను ఏర్పాటు చేశారు .ఇక 40 చోట్ల ఎతైన ప్రదేశాల నుంచి పోలీసులు డేగ కళ్ళతో పరిశీలించే కేంద్రాలను  ఏర్పాటు చేశారు . ఇక ఎక్కడ ఈ అవాంతరం జరిగినా గుర్తించడానికి వీలుగా 1000 సి సి కెమారాలను ఏర్పాటు చేశారు . ఇవి కాక 6000 మంది హోంగార్డ్స్ , 80 కామెనీల కేంద్ర బలగాలు ,20 కంపినీల సాయుధ కానిస్టేబుళ్లు  రక్షణ కోసం ఉంచినట్టు ఉత్తర్ ప్రదేశ్ డీజీపీ ఓపి  సింగ్ తెలిపాడు .  
ఎక్కడ ఎలాంటి ఫైర్ సమస్య తలెత్తినా  ఆదుకోవడానికి 55  ఫైర్ మోటార్ సైకిళ్ళను ఏర్పాటు చేశారు . అంత జనంలో ఫైర్ ఇంజిన్  వెళ్లడం కష్టం కనుక ఇలా ఏర్పాటు చేశామని ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ శర్మ తెలిపాడు . కుంభమేళాకు వచ్చిన భక్తుల కోసం 1,22,000 టాయిలెట్ లను ఏర్పాటు చేశారు . 1500 మంది  శానిటరీ  పనివాళ్ళు అవిశ్రాంతంగా  పని చేశారు . ఈరోజు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్  కుంభమేళాను విజయవంత చేసిన అధికారులను సత్కరించబోతున్నారు . 
ఇదే సందర్భంలో గిన్నిస్ రికార్డులో కుంభమేలా నమోదు ప్రక్రియ కూడా జరుగుతుంది . ఈ కుంభమేళాకు ఇది మూడవ గిన్నెస్ రికార్డు . కుంభమేళా జరిగేటప్పుడే రెండు గిన్నెస్ రికార్డులను నమోదు చేశారు . కుంభమేళాకు 4200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు . ఇందులో 2000 కోట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేయగా మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది .  కుంభమేళాను విజయవంతం చేయడంలో యోగి సర్కార్ విజయవంతమైంది .
 
-భగీరథ 

Related posts