telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అస్వస్థతకు గురైన దర్శకురాలు సంజనా రెడ్డి

Sanjana-Reddy

దర్శకురాలు సంజనా రెడ్డి అస్వస్థతకు గురయ్యారని.. హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో చేరారని వార్తలు వచ్చాయి. ఆమె పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రచయిత, నిర్మాత కోన వెంకట్ స్పందించారు. ఈ వార్తలను ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలన్నారు. సంజన మూడు రోజులుగా లిక్విడ్ డైట్‌లో ఉన్నారని.. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్‌లో చేర్పించారని వెంకట్ చెప్పారు. సోమవారం రాత్రి ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కరణం మల్లేశ్వరి బయోపిక్‌కు సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని కూడా కోన వెంకట్ వెల్లడించారు. ‘రాజుగాడు’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు సంజనా రెడ్డి. ఆ సినిమా తరవాత సుమారు రెండేళ్లకు పైగా విరామం తీసుకుని ఇప్పుడు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బయోపిక్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Related posts