telugu navyamedia
telugu cinema news trending

“బుట్టబొమ్మ” సాంగ్ కు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది స్టెప్పులు… బన్నీ రియాక్షన్ ఏంటంటే…!

buttabomma

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని పాటలకు వచ్చిన ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలోని పాటలు ఆదరణ పొందడం విశేషం. సినిమా విడుదలకు ముందు, విడుదలైన తర్వాత చిత్రంలోని ‘సామజవరగమన’ సాంగ్ సంచలనం సృష్టిస్తే.. సినిమా విడుదల తర్వాత చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ పాటకు కాలు కదపగా.. తాజాగా వైజాగ్‌కు చెందిన‌ ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అంతా కలిసి బుట్టబొమ్మ పాటపై చిందులేశారు. తాము డాన్స్ చేసిన ఈ వీడియోను ట్విట్ట‌ర్‌ ద్వారా బ‌న్నీకి ట్యాగ్ చేసి ఆయనను సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన అల్లు అర్జున్.. ఇలాంటి సంతోషాన్నిచ్చే ఆశ్చర్యం కలిగించినందుకు ఇండిగో సిబ్బందికి ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts

క్యాన్సర్ చిన్నారులకు పూజాహెగ్డే విరాళం

vimala p

మొదటి టీ 20లో .. భారత్ ఘనవిజయం…

vimala p

పిల్లలలో ఒబేసిటీ సమస్య .. భారత్ రెండోస్థానంలో .. అతిప్రేమతో ప్రమాదం అంచులలో..

vimala p