telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

కాంగో లో ఎబోలా వైరస్ వ్యాప్తి .. హజ్ యాత్ర వీసాలు రద్దు చేసిన సౌదీ ..

haj visa cancelled by soudi on ebola virus

సౌదీఅరేబియా, కాంగో దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఆ దేశానికి చెందిన యాత్రికులకు హజ్ యాత్ర కోసం వీసాలు ఇవ్వరాదని నిర్ణయించింది. హజ్ యాత్ర సందర్భంగా యాత్రికులకు ఎబోలా వైరస్ సోకకుండా సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుందని సౌదీ విదేశీ మంత్రిత్వశాఖ ప్రకటించింది. కాంగో దేశంలోని కీవు, ఇటూరి ప్రాంతాల్లో ఎబోలా వైరస్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కాంగో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

కాంగో దేశంలో ఉన్న మూడు శాతం ముస్లిముల్లో కొందరు హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. సౌదీ నిర్ణయంతో కాంగో దేశీయులు తమ హజ్ యాత్రను రద్దు చేసుకున్నారు. ఎబోలా వైరస్ వల్ల 1700 మంది మరణించారని కాంగో దేశ వైద్యమంత్రిత్వశాఖ ప్రకటించింది. కాంగోతోపాటు గునియా, సియార్రాలీన్. లిబిరియా దేశాల యాత్రికులకు సౌదీ రాజు వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Related posts