telugu navyamedia
వార్తలు సామాజిక

కనీస సౌకర్యాలు లేవంటూ కరోనా బాధితుల ఆందోళన

corona patients tamilnadu

ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవంటూ కరోనా బాధితుల ఆందోళనకు దిగారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని మంకాడు ప్రాంతంలో జరిగింది. కరోనా బాధితుల కోసం ముత్తుకుమారన్ వైద్య కళాశాల ప్రాంగణంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సెంటర్ లో మంచినీరు, ఆహారం అందించడం లేదని కరోనా పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా పేపెంట్లు రోడ్డు మీదకు రావడంతో భయంతో ఒక్కసారిగా స్థానికులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాధితులకు నచ్చజెప్పారు. దీంతో ఆందోళన విరమించిన బాధితులు తిరిగి క్వారంటైన్ సెంటర్‌లోకి వెళ్ళిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related posts