telugu navyamedia
Uncategorized

శరవేగంగా కరోనా వైరస్..విశాఖ అధికారులు అప్రమత్తం

nifha virus fear again in kerala

కరోనా వ్యాధి శరవేగంగా విస్తరిస్తుండడంతో విశాఖలో వైధ్యాధికారులు అప్రమత్తమయ్యారు. అతి పెద్ద పోర్టు ఉండడంతో విదేశాల నుంచి పారిశ్రామిక దిగుమతులు నిత్యం ఉంటాయి. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండడంతో విదేశాల నుంచి రాకపోకలు జరుగుతుంటాయి. కరోనా అతి ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ తీరనగరం విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

ఉత్తరాంధ్ర వైద్యదాయనిగా పేరొందిన కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో కరోనా బాధితుల కోసం మూడు పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ మాట్లాడుతూ ఇప్పటి వరకు బాధితులెవరూ లేరన్నారు. అయితే అత్యంత ప్రమాకరమైన వైరస్ కాబట్టి ముందు జాగ్రత్తగా పలు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైరస్ తీవ్రత అధికంగా ఉంటే కిడ్నీలపై దాని ప్రభావం పడుతుందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లోకి, మార్కెట్ కి వెళ్లేటప్పుడు ముఖానికి కర్చీఫ్, పేస్ మాస్క్ ధరిస్తే మంచిదన్నారు.

Related posts