telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ వ్యవహారంలో ఎంపీకి బెదిరింపులు… ప్రభుత్వం కీలక నిర్ణయం

Ravikishan'

సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు విచారణలో భాగంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ ఇష్యూ బాలీవుడ్ వర్గాలను వణికిస్తోంది. ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్ల పేర్లు బయటకు రావడం, వారిపై ఎన్సీబీ అధికారుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే డ్రగ్స్ రాకెట్ అంశంపై పార్లమెంట్ వేదికగా ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తనకు బెదింపు కాల్స్ వస్తున్నాయని రవికిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఆయన భద్రత విషయంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు Y+ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది యూపీ ప్రభుత్వం. ఈ మేరకు యూపీ ప్రభుత్వానికి, సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ప్రభుత్వం ఇస్తున్న అండతో డ్రగ్స్ ఇష్యూ విషయమై ఎక్కడా రాజీపడనని పేర్కొన్నారు. ప్రస్తుతం గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ కొనసాగుతున్న నటుడు రవికిషన్.. పార్లమెంట్ సాక్షిగా బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ ఇష్యూపై తన గళాన్ని వినిపించారు. అంతకుముందే సుశాంత్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన.. డ్రగ్స్ అంశం తెరపైకి వచ్చాక డ్రగ్స్ పెడ్లర్స్‌తో సినీ నటుల లింకులను బయటపెట్టేలా ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని కోరారు. ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ రోజురోజుకూ బాగా పెరిగిపోతోందని, ఇతర దేశాల నుండి డ్రగ్స్ సరఫరా జరుగుతోందని అనడంతో ఇండస్ట్రీ వర్గాల నుండి ఆయనపై వ్యతిరేకత మొదలైంది. అంతేగాక సినీ పరిశ్రమ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు కుట్ర పన్నుతున్నారని జయబచ్చన్ చేసిన వాఖ్యలపై రవికిషన్ మండిపడ్డారు. ఈ పరిస్థితులతో ఆయనకు, ఆయన కుటుంబానికి బెదిరింపులు మెదలయ్యాయి.

Related posts