మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “చిత్రలహరి” ఇటీవల విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. వరుస పరాజయాలతో బాధపడుతున్న సాయి ధరమ్ తేజ్ సక్సెస్ కోసం తన పేరును సాయి తేజ్ అని మార్చుకుని సెంటిమెంటును కూడా ఫాలో అయ్యాడు. ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫరవాలేదన్పించింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఎమోషన్స్ తో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమ బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ రన్ పూర్తి చేసుకుంది. 14.57 కోట్లు వరకూ కలెక్షన్స్ రాబట్టింది. గుంటూరు, కృష్ణా మినహా అన్ని చోట్లా ఈ సినిమా లాభాలు తెచ్చి పెట్టింది. సాయి కెరీర్ లో ఎబోవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది.
ఏరియా వైజ్ “చిత్రలహరి” కలెక్షన్స్
నైజాం – రూ8.6కోట్లు
సీడెడ్ – రూ.2.18కోట్లు
కృష్ణా – రూ.0.82కోట్లు
గుంటూరు – రూ.0.98కోట్లు
నెల్లూరు – రూ.0.50కోట్లు
వెస్ట్ – రూ.0.78 కోట్లు
ఈస్ట్ – రూ1.01 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.1.90 కోట్లు
టోటల్ ఆంధ్రా/తెలంగాణా – 12.57 కోట్లు
భారత్ లో మిగతా ప్రాంత్రాలు – 1.0 కోట్లు
ఓవర్ సీస్ – 1.0 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా – 14.57 కోట్లు