telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ఇకమీదట పరీక్షలకు వచ్చేప్పుడు.. మందులు, పండ్లు తెచ్చుకోవచ్చు..

candidates can bring tablets & fruits to exam centers

ఈ నెల 7 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్స్-2 (ఈ నెల 11న సెలవు) ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీతో పాటు పలు జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే డయాబెటిస్ విద్యార్థులు.. తమ వెంట షుగర్ ట్యాబ్లెట్లు, అరటి, ఆపిల్, నారింజ పండ్లతో పాటు ట్రాన్స్‌పరెంట్ నీళ్ల బాటిల్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.

విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, అడ్మిట్‌కార్డులో పొందుపర్చిన సూచనలు తప్పక పాటించాలని ఎన్‌టీఏ పేర్కొన్నది. పరీక్ష కేంద్రాన్ని ఒక్కరోజు ముందుగానే సందర్శించాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్టు సైజు ఫొటోతోపాటు పాన్‌కార్డు, ఓటర్‌ఐడీ, పాస్‌పోర్ట్, ఆధార్, ఈ ఆధార్‌లలో ఒకదానికి తీసుకురావాలని తెలిపారు.

గుర్తింపు కార్డు లేని విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని స్పష్టంచేశారు. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల మంది.. తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది వరకు హాజరయ్యే అవకాశమున్నదని నిపుణులు చెప్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కోదాడ, నిజామాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలోనూ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Related posts