telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

118 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. అతిధులుగా బాలకృష్ణ, తారక్..

balakrishna and tarak at 118 pre release event

నటుడు కల్యాణ్‌రామ్‌ కోసం నందమూరి బాలకృష్ణ, సోదరుడు తారక్‌ కలిసి రాబోతున్నారు…ఆయన నటించిన 118 చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలకు వీరిద్దరూ ప్రధాన ఆకర్షణగా విచ్చేస్తున్నారు. ‘118’ చిత్రం కేవీ గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. షాలినీ పాండే, నివేదా థామస్‌ కథానాయికలు. మహేశ్‌ కొనేరు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయట. ఫిబ్రవరి 28న అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్‌ షో నిర్వహించబోతున్నారు. నిర్వాణ సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేయబోతోంది. మార్చి 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాగా ఫిబ్రవరి 25న ‘118’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించబోతున్నారు. దీనికి బాలకృష్ణ, తారక్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత మహేశ్‌ కోనేరు ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ ప్రచార చిత్రంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Related posts