telugu navyamedia
సినిమా వార్తలు

“బాహుబలి-3″కి రంగం సిద్ధం… నెట్ ఫ్లిక్స్ లో…

Bahubali

ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సత్తా ఏమిటో నిరూపించిన సినిమా “బాహుబలి”. ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ అందరి దృష్టిలో పడింది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళికి, నటీనటులకు దేశవ్యాప్తంగా మంచి పేరు దక్కింది. అయితే రెండు భాగాలతో బాహుబలిని ముగించిన జక్కన్న మరో కథను తెరకెక్కించడం జరగదని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందని మాత్రం ప్రకటించారు. అయితే బాలీవుడ్ టెక్నీషియన్స్ ద్వారా వెబ్ సిరీస్ రూపంలో నెట్ ఫ్లిక్స్ “బాహుబలి 3″ని రెడీ చేయడానికి సిద్ధమైంది. ఈ ప్రీక్వెల్ కు “బాహుబలి : బిఫోర్ ది బిగినింగ్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. అనూప్ సోని కీలకపాత్రలో కనిపించనున్న ఈ సిరీస్ లో అమరేంద్ర బాహుబలి తల్లిదండ్రులు కూడా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయని, ఇటీవల మీడియా సమావేశంలో అనూప్ ఈ విషయాన్నీ తెలిపారు. బాహుబలి సినిమాకు పని చేసిన చాలా మంది టెక్నీషియన్స్ ఈ సిరీస్ కి పని చేయనున్నట్లు తెలుస్తోంది.

Related posts