telugu navyamedia
news political trending

బీజేపీ నేతలపై చేతబడి జరిగిందా.. మరో నేత ఆసుపత్రిపాలు..

another bjp senior hospitalized

బీజేపీ నేతలు ఈ ఏడాదిలోనే ఒక్కొక్కరిగా రాలిపోతున్నారు. అవన్నీ వరుసగా జరుగుతుండటం పలు అనుమానాలకు దారితీస్తుంది. చూడటానికి ఈ మరణాలు అన్నీ సహజంగానే ఉన్నా, వరుసగా జరుగుతుండటంతో .. అనుమానం సహజంగానే వస్తుంది. తాజాగా, మరో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆసుపత్రి పాలయ్యారు. కాన్పూర్ లోని తన నివాసంలో ఉండగా ఈ మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయనకు కాన్పూర్ లోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వయో నిబంధన కారణంగా ఇటీవలి ఎన్నికలకు దూరంగా ఉన్న మురళీ మనోహర్ జోషి బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. జోషి ఆరోగ్య స్థితి పట్ల బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Related posts

పోలవరం భద్రతను తాకట్టు పెట్టారు.. సీఎం జగన్ పై దేవినేని ఫైర్

vimala p

టెక్ తో .. ఉద్యోగాలు పోతున్నాయి.. 541 మందిని ఇంటికి పంపేసిన జొమాటో..

vimala p

మ్యూజికల్ నైట్ లో చిరంజీవి .. సంగీత కళాకారులను పట్టించుకోవాలని విజ్ఞప్తి..

vimala p