telugu navyamedia
business news trending

అమెజాన్ సీఈఓ జెఫ్ కి.. బెదిరింపులు…

america media blackmailing amazon ceo

జెఫ్ బేజోస్‌, అమెజాన్ సంస్థ సీఈవో, కు ఓ అమెరికా మీడియా సంస్థ నుండి బెదిరింపులు వస్తున్న వార్త సంచలనం రేపుతోంది. వ్యక్తిగత విషయాలు బట్టబయలు చేస్తాం అని సదరు మీడియా చేస్తున్న బెదిరింపులను గురించి ఆయనే వెల్లడించారు. నేషనల్ ఎంక్వైరర్ అనే మీడియా సంస్థ బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టుగా జెఫ్ వెల్లడించారు. తనకు సంబంధించిన రహస్య చిత్రాలు ఉన్నాయని, వాటిని పబ్లిష్ చేస్తామని మీడియా సంస్థ హెచ్చరిందని బేజోస్ అన్నారు.

వాటిలో గర్ల్‌ఫ్రెండ్‌కు పంపిన కొన్ని ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని అమెరికా టాబ్లాయిడ్ అంటోంది. వ్యక్తిగత ఫోటోలను బహిర్గతం చేయడం తనకు ఇష్టం ఉండదని, కానీ ఆ టాబ్లాయిడ్‌ను మాత్రం అన్ని విధాలా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు బేజోస్ చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో తన భార్య మెకంజీకు విడాకులు ఇస్తున్నట్లు బేజోస్ చెప్పారు. అయితే టెలివిజన్ యాంకర్ లారెన్ సాంచేజ్‌తో బేజోస్ డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Related posts

జాన్వి .. యోగా… అదిరిపోయింది..

vimala p

మరోసారి లీక్ అయిన ఫేస్ బుక్ డేటా.. ఈసారి అధినేతదే… చోరీ.. !!

vimala p

మహిళల రక్షణ : ఎన్ని చట్టాలు వచ్చినా … ఆగని అత్యాచారాలు.. భర్త ముందే..

vimala p