telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

అమెజాన్ అధినేతకు.. అవమానం .. ఇది రెండోసారి..

amazon owner jeff got question about quality

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ‘రీ-మార్స్‌’ పేరిట సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో బెజోస్‌ ప్రసంగిస్తుండగా.. భారత సంతతికి చెందిన ఓ మహిళ ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఆమెని బయటికి పంపాల్సి వచ్చింది. ప్రియా సాహ్ని(30) అనే మహిళ ‘డైరెక్ట్‌ యాక్షన్‌ ఎవ్రీవేర్’‌(డీఎక్స్‌ఈ) అనే జంతు సంరక్షణ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. అయితే స్వతహాగా జంతు ప్రేమికురాలైన సాహ్ని.. అమెజాన్‌ నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. కార్యక్రమంలో బెజోస్ ప్రసంగిస్తుండగా.. మధ్యలో ఒక్కసారిగా ‘జంతువుల పట్ల జరుగుతున్న అక్రమాలను అరికట్టాలి’ అని గట్టిగా అరుస్తూ ప్రియా వేదికపైకి దూసుకెళ్లారు. ‘‘మీరు ప్రపంచంలో అత్యంత ధనవంతులు. అమెజాన్‌ అధినేత అయిన మీరు జంతువుల్ని కాపాడగలరు. ఎలాగైనా జంతువుల పట్ల జరుగుతున్న అక్రమాలను ఆపండి’’ అని సమావేశంలో సాహ్ని గట్టిగా అరిచారు.

తాను అమెజాన్‌ చికెన్‌ ఫామ్స్‌ని సందర్శించానని చెప్పుకున్నారు. దీనితో అప్పటి వరకు సరదాగా సాగిపోతున్న కార్యక్రమంలో ఒక్కసారిగి నిశ్శబ్దం అలుముకుంది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వేదికపై నుంచి సాహ్నిని బయటకు తీసుకెళ్లారు. అనంతరం బెజోస్‌ స్పందిస్తూ.. ‘‘దీనికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా’’ అని నిర్వాహకులను ప్రశ్నించారు. అయితే అమెజాన్‌కు ప్రత్యేకంగా సొంత చికెన్‌ పామ్స్ లేకపోయినప్పటికీ.. కొన్ని సంస్థల నుంచి ఇది కోడి మాంసాన్ని కొనుగోలు చేస్తోంది. ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కోవడం బెజోస్‌కు ఇది రెండోసారి. గత నెల సియాటెల్‌లో జరిగిన ఓ సదస్సులో స్వయంగా అమెజాన్‌ వాటాదారు అయిన ఓ మహిళ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఓ వస్తువు నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాన్ని అక్కడే ఉన్న బెజోస్‌కు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశారు.

Related posts