telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

“మా ” ముఖ్యసలహాదారుడిగా మాజీ ఎంపీ కృష్ణంరాజు

Krishnam Raju Says Election contest

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ “మా ” ముఖ్యసలహాదారుడిగా మాజీ ఎంపీ, సినీ నటుడు కృష్ణంరాజును ఎన్నుకున్నారు. “మా ” అధ్యక్షుడిగా నరేశ్ ఎన్నికైన అనంతరం తొలి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఫిల్బ్ చాంబర్ లో నిర్వహించిన ఈ సమావేశానికి ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, “మా ” మాజీ అధ్యక్షుడు శివాజీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ “మా ” లోని సభ్యులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వ పాతకాలతో అనుసందానం చేస్తున్నట్టు తెలిపారు.

త్వరలనే ఫిల్మ్ నగర్ నటీనటుల సంఘం భావన నిర్మాణానికి పభుత్వం భూమి కేటాయిస్తుందని చెప్పారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ “మా ” ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్, మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాలిద్దరూ కలిసి అన్నీ సరిచేశారని అన్నారు. “మా ” కుటుంబం చాలా ఆనందంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు దంపతులతో పాటు ప్రముఖ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ సీనియర్ నటుడు దేవదాస్ కనకాలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, “మా ” సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts