టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని అన్నారు. గౌరవ ప్రధాన మంత్రి మోదీని తిట్టనటువంటి సిడీని రాష్ట్రపతిగారికి చూపించారా? లేకుంటే కేంద్రహోమంత్రి అమిత్ షాను తిరుపతి వస్తే రాళ్ళతో కొట్టినటువంటి వీడియోను చూపించడానికి రాష్ర్టపతిగారిని కలిశారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

అసాంఘీక శక్తులకు రారాజైన చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారు.. ? ఢిల్లీలో వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేయడానికి వచ్చారా? అంటూ ఎద్దేవా చేశారు . లేదా ఏపీ పరువు తీశామని చెప్పుకోవడానికి వచ్చారా..? అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన గంజాయి వ్యాపారంలో లోకేశ్ కు కూడా వాటాలున్నాయని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందుల సరఫరా లో ఏపి కి సంబంధం లేదని నార్కోటిక్స్ సంస్థ స్పష్టం చేసిందని నిప్పులు చెరిగారు విజయసాయి రెడ్డి.

ఒకప్పుడు మహానాడులో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు లేవని స్పష్టం చేసిన ఆయన ఇప్పుడేమో అదే రాష్ట్రపతి పాలనను ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు.… పట్టాభి తిట్లను చంద్రబాబు సమర్థిస్తున్నారా? అనిప్రశ్నించారు. చంద్రబాబు కావాలనే పట్టాభితో సీఎం జగన్ ను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి మాటలను ప్రజలే వ్యతిరేకిస్తున్నారని అన్నారు.


కేంద్రం చెబుతున్నా వైసీపీ ప్రభుత్వానికి అర్థం కాలేదు: చంద్రబాబు