telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు: సుప్రీంకోర్టులో కొత్తగా పిటిషన్ దాఖలు చేసిన నర్రెడ్డి సునీతారెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  తదుపరి దర్యాప్తు పరిధిని కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితం చేస్తూ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో కొత్తగా పిటిషన్ దాఖలు చేశారు.

ట్రయల్ కోర్టు నిర్ణయం, తాము లేవనెత్తిన అంశాలకు, సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆ ఆదేశాల మేరకు విచారణ జరిపిన సీబీఐ కోర్టు, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశాలపై మాత్రమే దర్యాప్తును పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పాక్షిక ఉత్తర్వులనే సునీతారెడ్డి తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.

సునీత దాఖలు చేసిన ఈ తాజా పిటిషన్‌ను, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Related posts