telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తొమ్మిది వారాలుగా బాబ వ్రతం చేస్తున్నఉపాసన కొణిదెల

upasana

లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనారు. ఎక్కడికీ పోలేని పరిస్థితి వుంది. ఈ సమయంలో ఎవరికి తోచిన ట్వీట్లు వ్వారు పెడుతున్నారు. రాంచరణ్ సతీమణి ఉపాసన అనేక రకాల ట్వీట్లు పెడుతోంది. తాజాగా ప్రసాదం తయారు చేస్తున్నట్లు ఉపాసన ఓ ట్వీట్ చేశారు. తాను సాయిబాబా వ్రతంలో ఉన్నానని ఇది తొమ్మిదవ వారం అని ట్వీట్ చేశారు. ఇవాళ గురువారం కావడంతో ఉపాసన బాబ వ్రతానికి సంబంధించిన వార్తను తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేశారు. ఉపాసన ట్వీట్ పై రామ్ చరణ్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఆమె టాయిలెట్ పొజీషన్‌లో కూర్చోగలరా అంటూ కొత్త ఛాలెంజ్ విరిసారు. ఇలా 5 నిమిషాల పాటు ఇలా కూర్చోగలరా అంటూ నెటిజన్స్‌కు కొత్త పరీక్ష పెట్టారు. ‘నగరంలో నివసించే చాలామంది ప్రజలకు ఈ స్థితిలో కూర్చోవడానికి కష్టపడతారు. ఇది చాలా కఠినంగా ఉంది’ అంటూ ఉపాసన ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఆమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Related posts