లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవల ‘దర్బార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న ‘మూకుట్టి అమ్మన్’, ‘నెట్రికన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే నయన్ అసలు పేరు డయానా మరియం కురియన్ అని దాదాపుగా అందరికీ తెలిసిందే. 2003లో ఆమె ‘మనస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకుడు. సినిమా టైటిల్స్ వేసేటప్పుడు నయన్ పేరును డయానా కాకుండా నయనతార అని వేశారట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమె పేరు నయనతార అని ఫిక్స్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తానేంటో అన్ని భాషల్లో నిరూపించుకుంది. అయితే ఇప్పుడు నయనతారకు ఈ పేరు ఎవరు పెట్టారు అనే విషయమై ఇద్దరు దర్శకులు కొట్టుకుంటున్నారు. ఆ పేరు నేను పెట్టానంటే నేను పెట్టానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటున్నారు. నయనతారకు ఆపేరు పెట్టింది నేనే అంటూ ఇటీవల డిట్టో జాన్ అనే దర్శకుడు అన్నారట. దాంతో సత్యన్‌కు మండింది. సోషల్ మీడియా ద్వారా తన బాధను వెళగక్కారు. ‘నేను, నా స్నేహితుడైన డైరెక్టర్ రంజన్ ప్రమోద్ నయనతారకు ఆ పేరు పెట్టాం. నాకు జాన్ డిట్టో ఎవరో కూడా తెలీదు. అసలు ఈ విషయంపై ఇంత చర్చ జరపాల్సి వస్తుంది నేను అనుకోలేదు. ‘మనస్సినక్కరే’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ రోజు ఉదయం నేను, దర్శకుడు రంజన్ కలిసి నయనతారకు ఏం పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచించుకున్నాం. అప్పుడు నయనతార అన్న పేరు తట్టింది. మేం తయారు చేసిన పేర్ల జాబితాలో నయనతార పేరును యాడ్ చేసి నయన్‌కు ఇచ్చాం. తనకు కూడా ఆ పేరే నచ్చింది. అదే తన స్క్రీన్ నేమ్ అయిపోయింది’ అని ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కాని విషయం.
							previous post
						
						
					
							next post
						
						
					

