సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో రాయలసీమ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడుమీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఛత్తీస్గఢ్ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాం తాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు.
దీని ప్రభావంగా రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశముందన్నారు.


ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తా: కేసీఆర్