ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనాతో చనిపోయిన వారి దహనక్రియలకు కూడా ఒప్పుకోవట్లేదు జనం. ఈ నేపథ్యంలో తాజాగా కోవిడ్ బారిన పడి మరణించిన వ్యక్తి యొక్క మృతదేహానికి తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి గారు తనే స్వయంగా దగ్గరుండి దహనక్రియలు నిర్వహించి ప్రజల్లో నెలకొన్న భయాలను, అపోహలను తొలగించే కార్యక్రమం చేశారు. సొంత కుటుంబ సభ్యులు, బంధువులే దగ్గరకు వెళ్ళడానికి భయపడుతున్న తరుణంలో అందరిలోనూ ధైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని నింపడానికి నాయకుడుగా ముందుండి నడిపించారు. సరిగ్గా ఏడు సంవత్సరాల ముందు లక్ష్మీ పురం సర్కిల్ లోని స్మశానవాటికకు ప్రహరిగోడ కట్టించి, సదుపాయాలు ఏర్పాటు చేయాలని సమాధుల పై రాత్రి నిద్ర (స్మశాన నిద్ర) చేసిన భూమన నేడు మరోసారి నాయకుడుగా తన ప్రజలకు ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేపట్టారు.
previous post


జగన్ ప్రకటనతో హైదరాబాద్ లో రేట్లు పెరిగాయి: సీపీఐ నారాయణ