telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘ప్రవాసాంధ్ర భరోసా’ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకువచ్చింది. ‘ప్రవాసాంధ్ర భరోసా’ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో ప్రారంభించారు.

ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అందించనుంది.

ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.

ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాల కోసం 24/7 అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ నెంబర్ 8632340678, వాట్సాప్ నెంబర్ 8500027678లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకే వీలు కల్పించింది సర్కార్.

Related posts