• తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అతిపెద్ద పండుగ మహానాడు
• స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి జయంతిని మహానాడు పండుగగా నిర్వహించుకుంటున్నాం.
• కడప గడ్డపై ‘కార్యకర్తే అధినేత’ అనే తీర్మానంపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
• ఈ రోజు మహానాడు ఇంత ఆనందంగా చేసుకోడానికి.. గత ఐదేళ్లు, 2024 ఎన్నికల్లో కార్యకర్తల శ్రమ ఫలితమే.
• తెలుగుదేశం పార్టీకి బలం.. బలగం కార్యకర్తలే
• అన్న ఎన్టార్ పార్టీ స్థాపించిన రోజు నుండి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
• ఎన్ని కష్టాలొచ్చినా, అవమానాలు ఎదురైనా, ఇబ్బందులు కలిగినా జెండా వదల్లేదు
• గత ఐదేళ్లు కార్యకర్తలు ఎదుర్కొన్న అవమానాలు, అక్రమ కేసులు చరిత్రలో ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు.
• యువ నాయకుడు నిర్వహించిన పాదయాత్ర తెలుగుదేశ పార్టీ చరిత్రలో మరో మలుపురాయి
• పాదయాత్రను అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు చేసినా.. కార్యకర్తలు ముందుండి నడిపించారు
• తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అణచివేయాలని.. పార్టీలోని నాయకులందరిపైనా తప్పుడు కేసులు పెట్టి వేధించారు
• జైళ్లలో పెట్టి నాయకత్వం లేకుండా చేయాలని కుట్రలు చేశారు
• గ్రామస్థాయిలో తోట చంద్రయ్య లాంటి పార్టీ నాయకుల్ని హత్య చేశారు
• గొంతుపై కత్తి పెట్టి జగన్ రెడ్డికి జేజేలు కొట్టమంటే.. చంద్రబాబు వెంటే ఉంటానని ప్రాణ త్యాగం చేశారు
• మన నాయకుడిని అక్రమ కేసులో 53 రోజులు జైల్లో పెట్టినా గానీ.. నాయకత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు
• ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు రోడ్డెక్కి జగన్ రెడ్డి నియంతృత్వాన్ని నిలదీశారు
• గడపగడపకూ వెళ్లి.. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు
• కార్యకర్తల త్యాగాలను స్మరించుకునేలా తీర్మానాన్ని ప్రవేశపెట్టే బాద్యత ఇచ్చినందుకు మంత్రి కొల్లు రవీంద్ర ధన్యవాదాలు తెలిపారు.
వల్లభనేని వంశీ వర్సెస్ టీడీపీ.. పెరుగుతున్న మాటల యుద్దం!