అటవీశాఖ మంత్రిగా ఇటీవల తాను సమీక్ష నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడిందని చెప్పారు.
శేషాచలం అడవుల్లో లభించే ఎర్రచందనం దుంగలను దేశం దాటించగా అవి నేపాల్లో దొరికాయన్నారు. వాటిని వెనక్కి తీసుకురావడానికి సంబంధించిన ఫైలు తన వద్దకు వచ్చిందని చెప్పారు.
వైసీపీ పాలనలో ఎర్రచందనం అడ్డగోలుగా దేశాలు దాటిపోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు మిథున్రెడ్డి అమ్మేసుకున్నారన్నారు. వీటిని మన చెక్పోస్టులు వదిలేస్తే నేపాల్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రారంభించే అన్న క్యాంటీన్లలో కొన్ని డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయన్నారు.