ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’కు ఎంపిక చేసింది.
పలు శుభ సందర్భాలు ఒకేసారి కలిసివచ్చిన ఈ తరుణంలో ఈ అవార్డు దక్కడం దైవ నిర్ణయంగా, తన తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, “ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తిచేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒకవైపు,
ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు, నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ని నాకు ప్రకటించడం నా అదృష్టంగా, దైవ నిర్ణయంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను” అని అన్నారు.
ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి తనను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జ్యూరీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపకుంటున్నానని బాలకృష్ణ వెల్లడించారు.
జగన్ గారి మొసలి కన్నీరు ఎందుకు?: బుద్ధా వెంకన్న