ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ పిటిషన్‌తోపాటు ఇదే కేసులో దిగువ కోర్టు తనపై అరెస్టు వారెంట్ జారీ చేయడం, సోమవారం వరకు సీబీఐ కస్టడీకి పంపాలంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై కోర్టు బెంచ్ విచారణ జరపనుంది.
మనీలాండరింగ్ కేసులో సోమవారం వరకు చిదంబరంను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తూ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈడీని ఆదేశించిన విషయం తెలిసిందే. చిదంబరం పిటిషన్లపై సమాధానం ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం ఈడీని కూడా ఇప్పటికే ఆదేశించింది.

