సూపర్ స్టార్ రజనీకాంత్ కు అరుదైన గౌరవం లభించింది. యూఏఈ సాంస్కృతిక, పర్యాటక శాఖ (డీటీసీ) రజనీని గోల్డెన్ వీసాతో సత్కరించింది.
అబుదాబీలో జరిగిన కార్యక్రమంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ గోల్డెన్ వీసా కార్డును రజనీకి అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళీ వ్యాపారవేత్త, లులు మాల్ సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ పాల్గొన్నారు.
‘అబుధాబీ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకోవడాన్నిగౌరవంగా భావిస్తున్నా. ఇందుకుగాను అబుధాబీ ప్రభుత్వానికి, దాన్ని పొందడంలో సహకరించిన నా స్నేహితుడు, లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని రజనీ తెలియచేసారు.


సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ