సంగీత దర్శకుడు, సింగర్ అమల్ మాలిక్ తనకు హీరో షారుక్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని ప్రకటించారు. దీంతో సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం లేదా అంటూ ఆయన అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. అతడిపై వేధింపులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో అమల్ సోమవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రోలింగ్‌పై స్పందించారు. “డియర్ ఇడియట్స్… మీరు నా ప్రొఫైల్‌కు వచ్చి వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఎందుకంటే నేను సల్మాన్ ఖాన్‌కు గౌరవం ఇవ్వడం లేదని మీరు భావిస్తున్నారు. నేను ఎప్పటి నుంచో ఆయనకు రుణపడి ఉన్నాను. అతనో సూపర్ స్టార్, బెస్ట్ ఎంటర్టైనర్ కూడా. కానీ నా చిన్నప్పటి నుంచే నాకు షారుక్ అంటే ఇష్టం. ఇందులో తప్పేముందో తెలుసుకోవచ్చా. దీన్ని పట్టుకుని నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారు. చంపుతాం అని బెదిరించే అభిమానులు ఉంటే ఏ హీరో మాత్రం సంతోషపడతారు? ఇంత ఘోరంగా ట్రోల్ చేయడం చూసి నేను నిజంగా షాక్ అవుతున్నా. చదువు రాని దద్దమ్మలు నన్ను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమంటున్నారు. ఇలాగేనా మీ ఫేవరెట్ హీరోకు మద్దతు చేసే విధానం. ఇది మానవత్వం అనిపించుకుంటుందా? ఇంత విషం చిమ్ముతుంటే ఎవరు మాత్రం ఓపిక పట్టగలరు? నన్ను, నా కుటుంబాన్ని, నా అభిమానులను ఏమైనా చేస్తారేమోనని నేను భయంతో మౌనంగా ఉంటానని ఎంతమాత్రం అనుకోవద్దు. నా వాళ్ల జోలికి ఎవరినీ రానివ్వను. నా నిర్ణయాలు కూడా తమరే డిసైడ్ చేయాలనుకున్న చదువు సంధ్యా లేని మనుషుల్లారా! ఈ సందేశం మీ అందరికీ చేరుతుందనుకుంటున్నా…” అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
previous post
next post