సిద్ధిపేట కలెక్టర్ గా సంగారెడ్డికలెక్టర్ హనుమంతరావు అదనపు బాధ్యతలు చేపట్టారు. వర్గల్ సరస్వతి దివ్యసన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు ఆశీర్వచనాలు అందించి సంకల్పపూజ చేశారు.
సరస్వతి అమ్మవారి దయతో సిద్దిపేట జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావుకు జిల్లా అదనపు కలెక్టర్ ముజాంబిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి చెన్నయ్య, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.


అధికారులు కండువాల్లేని టీఆర్ఎస్ కార్యకర్తలు: జీవన్‌రెడ్డి