telugu navyamedia
సినిమా వార్తలు

సీనియర్ కమెడియన్ హీరోగా “అలెగ్జాండర్”… ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం

Jayaprakash-Reddy

టాలీవుడ్‌లో ఎన్నో విలక్షణ పాత్రల్లో అలరించిన నటుడు జయప్రకాష్ రెడ్డి. తెలుగు ఇండస్ట్రీలో ప్రతినాయకుడిగా.. కమెడియన్‌గా.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో అద్భుతమైన నటనతో ఎంతో విలక్షణమైన పాత్రలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఎన్నో వందల చిత్రాల్లో నటించిన ఈ సీనియర్‌ నటుడు ఇప్పుడు హీరోగా మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. త్వరలో జయప్రకాష్ రెడ్డి హీరోగా ఓ సినిమా విడుదల కానుంది. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై జయప్రకాష్ రెడ్డి హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. “అలెగ్జాండర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధవళ సత్యం దర్శకుడు. ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కేవలం జయప్రకాష్‌ రెడ్డి ఒక్కడే పాత్రదారి కావటం విశేషం. కథా కథనాలు నచ్చి జయప్రకాష్‌ రెడ్డి స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదిని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్.

Related posts