telugu navyamedia
Uncategorized

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Accident

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి సమీపంలో ఈరోజు ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటో, లారీ పరస్పరం ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రయాణికులతో వస్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న లారీ పరస్పరం ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Related posts