telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపు పాట్నాలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరు కానున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సాయంత్ర బీహార్ వెళ్ళనున్నారు. రేపు పాట్నాలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ఆయన హాజరు కానున్నారు.

ఆ తర్వాత ఈ నెల 25న తమిళనాడులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ‘నీట్’పై నిర్వహించబోయే సమావేశం కోసం చెన్నై వెళతారు.

మేడారంలో సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు.

అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఆదివాసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని, ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అమ్మవార్ల ఆశీస్సులతో 2023 ఫిబ్రవరి 6న ఇక్కడి నుంచి తాను పాదయాత్ర ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. నాటి పాలకులు సమ్మక్క-సారలమ్మ అభివృద్ధిపై వివక్ష చూపారని ఆరోపించారు.

తమ ప్రభుత్వం ఆలయం అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.

Related posts