మేషం : వస్త్ర, బంగారం, వెండి ఫ్యాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. స్త్రీలకు ఆలయాలలో సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి.
వృషభం : ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మతులు చేపడతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితులు అండగా నిలబడతారు.
మిథునం : వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు వ్యావహరల్లో ఆలోచించి వ్యవహరించండి. ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
సింహం : మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉపాధ్యాయులు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రుణ విముక్తులుకావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
కన్య : నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఉద్యోగస్తులకు హోదా పెరగడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆస్తి విషయంలో సమీప బంధువులు బాగా ఇబ్బంది పెడతారు.
తుల : కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, వ్యావసాయ రంగాల వారికి ఆశాజనకం. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది.
వృశ్చికం : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరుగుతాయి. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.
ధనస్సు : సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం మంచిది.
మకరం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.
కుంభం : విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. స్వయంకృషితో రాణిస్తారు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు.
మీనం : మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. సభల, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు వాయిదాపడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.