telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 4, గురువారం రాశిఫ‌లాలు…

మేష రాశి..
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. అలాగే ఆకస్మిక ప్రయణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఆర్థిక పరిస్థితులలోనూ మార్పులు ఉంటాయి.. నూతన పరిచయాలు. వ్యాపారాలలో వృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి.

వృషభ రాశి..
ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.. ఆభరణాలు కొంటారు. అలాగే రుణాలు పొందుతారు. వినోదాలు.. శుభకార్యాలలో పాల్గోంటారు. కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

మిథున రాశి..
ఆత్మీయులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. చేపట్టిన పనులను వాయిదా వేసుకుంటారు.. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే అనుకోని ప్రయణాలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

కర్కాటక రాశి..
బకాయిలు, ఇంటి అద్దెలు, ఇతరాత్రా వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. కుటుంబసభ్యులు.. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువవుతాయి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

సింహ రాశి..
చేపట్టిన పనులలలో ఏకాగ్రత ఎంతో అవసరం. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు.. రుణభాధలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనయోగం క‌లుగుతుంది.

కన్య రాశి..
అనుకోని దూరప్రయాణాలు చేస్తారు. పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. శుభవార్తలు వింటారు.. కుటుంబంలో ఆనందంగా ఉంటారు.. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్తిక సమస్యలు తొలగిపోతాయి.ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి.

తుల రాశి..
ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది, ప్రమోషన్ వంటి శుభపరిణామాలు ఉంటాయి. వీరికి స్నేహితులు.. కుటుంబసభ్యులతో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దైవదర్శనాలు చేస్తారు.

వృశ్చిక రాశి..
ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సహోద్యోగులతో సౌమ్యంగా మెలగవలసి ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.. ప్రతి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఖర్చులు ఎక్కువవుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనస్సు రాశి..
గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు అన్ని విధాలా శుభదాయకంగా ఉంటుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు.. కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు.

మకరరాశి..
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారిక ఆశాజనకం. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. వి పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.

కుంభ రాశి..
ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. వైద్యులకు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. కుటుంబసభ్యులు.. సన్నిహితులతో మంచిగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యక్తులతో స్నేహం చేసే సమయంలో అచి తుచి వ్యవహరించాలి. ఆలయాలు సందర్శిస్తారు.

మీనరాశి..
సంఘంలో గౌరవమర్యాధాలు పెరుగుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ల‌భిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో సన్నిహితంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం .సన్నిహితుల నుంచి ఒత్తిడులు క‌లుగుతాయి.

Related posts