telugu navyamedia
రాశి ఫలాలు

దిన ఫలితాలు : జూన్ 29 శనివారం రాశిఫ‌లాలు.

మేషరాశి..

నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

వృషభరాశి..

మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మిథునరాశి..

వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.

కర్కాటకరాశి..

కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహరాశి..

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు.

కన్య రాశి..

రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి.

తులరాశి..

ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

వృశ్చికరాశి..

కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

ధనుస్సురాశి..

వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు.

మకరరాశి..

ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు.

కుంభరాశి..

నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మీనరాశి..

ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు.

Related posts