క్యుములో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ నగరంలో గత రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హయత్ నగర్ ఉప్పల్ సమీపంలో మొదలైన వర్షం ఆపై ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మల్కాజ్ గిరి, మలక్ పేట లకు విస్తరించింది.ఆపై ఖైరతాబాద్, మెహిదీపట్నం, కూకట్ పల్లి ప్రాంతాలకు వ్యాపించి, మాదాపూర్, శంషాబాద్ మీదుగా మేఘాలు విస్తరించాయి. రాత్రి ఒంటిగంట సమయంలో శేరిలింగంపల్లి ప్రాంతాన్ని వాన ముంచెత్తింది. మూడు గంటల ప్రాంతంలోనూ కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి.
తెల్లవారుజామున రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాత్రంతా ఉరుములు, మెరుపులు కనిపిస్తూనే ఉన్నాయి.వర్షాల ప్రభావం మరికొన్ని రోజులు ఉంటుందని, నైరుతీ రుతుపవనాలు ఈ మేఘాలకు జత కలవనుండటంతో మరిన్ని వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ్ ప్రభావం కూడా తెలంగాణపై కనిపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


కశ్మీర్ ప్రజలను జైలుకు తరలిస్తున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా