దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. గతకొంతకాలంగా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో డికాక్ 16 మ్యాచ్‌లాడి 140.5 స్ట్రెక్‌రేట్‌తో 35.92 సగటుతో 503 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో స్వదేశంలో దక్షిణాఫ్రికా.. పాకిస్థాన్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 2న ప్రారంభమై అదే నెల 16తో ముగుస్తుంది. డికాక్ ప్రొటీస్ సారథిగా ఉండటంతో.. ఆ సిరీస్‌లో అతను ఆడటం తప్పనిసరి. దీంతో ఐపీఎల్‌కు డికాక్ రెండు వారాలపాటు దూరమవనున్నాడు. దాంతో అతని స్థానంలో క్రిస్ లిన్ ఓపెనర్‌గా ఆడడం ఖాయం అయింది. అందుకే అందరికంటే ముందుగానే ముంబై చేరుకున్నాడు. లిన్.. సిడ్నీ నుంచి నేరుగా ముంబైకి వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో వారం రోజుల క్వారంటైన్ అనంతరం లిన్ ప్రాక్టీస్ మొదలెట్టనున్నాడు. ప్రస్తుతం అతడు ముంబై యాజమాన్యం ఏర్పాటు చేసిన హోటల్లో ఉన్నాడు. అయితే 2020 ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మాన్ క్రిస్ లిన్‌ను ముంబై ఇండియన్స్ రూ .2 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
							previous post
						
						
					


జగన్ ఫ్యాన్ స్విచ్ మోదీ వద్ద..రెగ్యులేటర్ కేసీఆర్ వద్ద: నారా లోకేశ్