బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్‌చార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణానికి అరుదైన గౌరవం దక్కింది.
ప్రతిష్టాత్మక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) అందించే విశిష్ట పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.
జులై 3వ తేదీన తానా 24వ మహాసభల్లో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. వ్యవసాయ రంగంలో పాతూరి నాగభూషణం చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం లభించినట్లు తానా సభ్యులు మీడియాకు వెల్లడించారు.
ఈ క్రమంలో పాతూరి నాగభూషణం ఈ అవార్డును అందుకోవడం కోసం అమెరికా వెళ్లారు. తనకు తానా అవార్డు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.