నేడు స్టాక్ మార్కెట్లు ఆర్బీఐ రెపో రేట్ తగ్గింపు ప్రభావం దెబ్బకు కుదేలైపోయాయి. దీనితో మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ ఏడాదిలో ఒక రోజులో స్టాక్ మార్కెట్లు ఇంత నష్టం చవిచూడటం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతుండటం గమనార్హం. సెన్సెక్స్ 550 పాయింట్లు నష్టపోయి 39,530 వద్ద, నిఫ్టీ 178 పాయింట్లు కోల్పోయి 11,844 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 40,000; 12,000 పాయింట్ల మార్క్ కు దిగువకు చేరడంతో అన్ని రంగాలూ నష్టాల్లో మునిగిపోయాయి.
ముఖ్యంగా, పీఎస్ యూ బ్యాంక్స్ సంస్థల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, మీడియా రంగాలు కూడా అదే బాటలో నడిచాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇండస్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నాలుగు నుంచి ఎనిమిది శాతం నష్టపోగా, కోల్ ఇండియా, టైటాన్, హీరో మోటార్స్ మొదలైన సంస్థల షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.