telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

వరద ఉద్ధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు

తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.

వరద ఉద్ధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం 2,16,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మిగతా చోట్ల కూడా ముసురు వాతావరణం నెలకొంది.

రెండు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, నదులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది.

రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Related posts