నందమూరి బాలకృష్ణ ఇప్పట్లో సినిమా చేసే మూడ్ లో లేదని తెలుస్తుంది. తన తండ్రి జీవిత కథను “ఎన్టీఆర్ బయోపిక్ ” రెండు భాగాలుగా, కథానాయకుడు, మహానాయకుడు పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాకు మొదట దర్శకుడు తేజను తీసుకున్నారు . అట్టహాసంగా ముహూర్తం కూడా చేశారు. ప్రోటో కాల్ ను పక్కన పెట్టి భారత ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు. అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలుకాక ముందే తేజ నేను ఈ సినిమా చేయలేనని చేతులెత్తాడు.
అప్పుడు ఎవరితో ఈ సినిమా డైరెక్ట్ చేయించాలి అనుకున్నప్పుడు పరిశీలనకు వచ్చిన పేర్లు, కె.రాఘవేంద్ర రావు, కృష్ణ వంశీ, వై వి ఎస్.చౌదరి, రామ్ గోపాల్ వర్మ, జాగర్లమూడి క్రిష్. అందరికంటే బాలయ్య జాగర్లమూడి క్రిష్ ను అనుకున్నాడు. అయితే అప్పుడు క్రిష్ కంగనా రనౌత్ తో “మణి కర్ణిక” సినిమా చేస్తున్నాడు. బాలకృష్ణ, క్రిష్ అంతకు ముందు “గౌతమిపుత్ర శాతకర్ణి” సినిమా చేశారు. ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. బాలయ్య కోసం “మణికర్ణిక” సినిమా పూర్తి చెయ్యకుండా క్రిష్ వచ్చి “ఎన్టీఆర్ బయోపిక్ ” దర్శకత్వ భాద్యతలు స్వీకరించాడు.
అసలు ఈ సినిమా ఆలోచన సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిది; నిర్మాతలు వీరే. చాలా మంది నటీనటుల తో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఎవరూ ఊహించని హైప్ ఈ సినిమాకు వచ్చింది. ఈ సినిమా కొనడానికి బయ్యర్లు ఎగబడ్డారు, ఓవర్సీస్, శాటిలైట్ విషయంలో కూడా బాలకృష్ణ ఊహించని రేట్లు వచ్చాయి. అప్పుడు బాలకృష్ణ సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి పేర్లను సమర్పకులుగా వేసి నిర్మాతలుగా తాను, తన భార్య వసుందర పేర్లు వేసుకోవడం మొదలు పెట్టాడు. తన స్వంత బేనర్ ఎన్.బి.కె ప్రొడక్షన్ హౌస్ ను ప్రకటించాడు. మొదట సినిమాకు కావలసిన డబ్బంతా సాయి, విష్షు పెట్టారు.
రెండు భాగాలు కలిపి 120 కోట్ల వరకు అమ్మారని సమాచారం. ఆ ఇద్దరికీ పెట్టుబడితో పాటు మరి కొంత ఇచ్చి మిగతా డబ్బు అంతా బాలకృష్ణ తీసుకున్నాడట. జనవరి 9న విడుదల చేసిన కథానాయకుడు సినిమా కేవలం 19 కోట్లను మాత్రమే వసూలు చేసింది. బాలకృష్ణకు ఊహించని షాక్. బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు. రెండవ భాగం మహానాయకుడును కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. మహానాయకుడు సినిమాకు ఏవో కొన్ని మార్పులు చేశారు. బయ్యర్లకు మహానాయకుడు సినిమాను ఉచితంగా ఇస్తున్నట్టు చెప్పారు. బయ్యర్లు కనీసం ఈ సినిమా లోనైనా లాభాలు వస్తాయని ఆశించారు. అందరికీ షాక్ … దిమ్మతిరిగే షాక్. కథానాయకుడు సినిమా బెటర్ అన్నారు. మహానాయకుడు సినిమా కేవలం 5 కోట్లని వసూలు చేసింది. చాలామంది బయ్యారు థియేటర్ లకు ఎదురు కట్టవలసి వచ్చింది.

ఇది ఎన్టీఆర్ బయోపిక్ కాదు బాలయ్య ఊహల్లోనుంచి బయటపడ్డ బయోపిక్ అన్నారు. మహానాయకుడు ఎన్టీఆర్ కు పెద్ద అవమానం అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి బాలయ్యకు డబ్బు వచ్చింది కానీ పరువు పోయింది. ఇంతకాలం ఉన్న గౌరవము కూడా పోగొట్టుకున్నాడు. తొలిసారి ఎన్.బి.కె ప్రొడక్షన్ హౌస్ తీసిన సినిమా ఊహించని దెబ్బ వేసింది. ఈ బేనర్ లోనే మోక్షజ్ఞ ను పరిచయం చేద్దామని అనుకున్నాడట. కానీ అన్నీ తారుమారు అయిపోయాయి. ఊహా సౌధాలు కూలిపోయాయి. డైరెక్టర్ క్రిష్ పరిస్థితి మరీ ఘోరం. ఇంతకాలం క్రిష్ అంటే మంచి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ తో అదంతా తుడిచిపెట్టుకు పోయింది.
ఇప్పుడు బాలయ్య సినిమా పేరు ఎత్తితే మండి పడుతున్నాడట. ఇక నుంచి తన స్వంత బేనర్లో సినిమాలు చెయ్యాలనుకున్న బాలయ్య ఇప్పుడు స్వంత బేనర్ ను కొంతకాలం అటక ఎక్కించాడట. ఇప్పుడు బోయపాటి సినిమా చెయ్యాలి. అయితే ఆ సినిమా కూడా ప్రారంభం కాకపోవచ్చని, ఎన్టీఆర్ బయోపిక్ చేసిన గాయం మర్చిపోవడాని రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండాలనుకుంటున్నాడట. అందుకే ఇప్పుడు బాలయ్యతో సినిమాల గురించి మాట్లాడటంలేదట. సింహంలా గర్జించే బాలయ్య …. ఇప్పుడు… మౌనంగా వుండిపోయాడు.


సెక్రటేరియట్ వాస్తు ప్రభావం వల్ల ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. మాధవీలత షాకింగ్ పోస్ట్