లేడీ సూపర్ స్టార్ నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. స్టార్ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. ఇప్పట్లో ఆమె స్థాయిని అందుకునేవారే లేరని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఆమె సినిమాల్లో హీరో నామమాత్రమే. అసలైన హీరో ఆమె. ఆమె పేరుతోనే కోట్లు వచ్చి పడుతుంటాయి. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళంలో బిజీగా ఉన్న ఆర్టిస్టులలో ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరో సినిమాలలో నటిస్తూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. దర్భార్ చిత్రంలో రజనీ సరసన కథానాయికగా నటిస్తున్న నయన్.. విజయ్, అజిత్, చిరంజీవి చిత్రాలలో కథానాయికగా ఎంపికైంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకి కూడా హాజరు కాలేనంత బిజీగా ఉన్న నయనతార సినిమా రెమ్యునరేషన్ భారీగానే పెంచిందనే టాక్ వినిపిస్తుంది. తాజాగా ఆమె రెమ్యునరేషన్ 6 కోట్లకి పై మాటే అని అంటున్నారు. హీరోలకి సమానంగా ఈ అమ్మడు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తుందట. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ తొలిసారి నిర్మాతగా మారి నయన్‌తో నెట్రికన్ అనే సినిమా చేస్తున్నాడు. మిలింద్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా నయన్ అంతే అమౌంట్ డిమాండ్ చేస్తుందని టాక్.
previous post
next post