telugu navyamedia
సినిమా వార్తలు

నయనతార హార్రర్ థ్రిల్లర్ “ఐరా’ ట్రైలర్

Nayanatara-Iraa

లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళంలో చేసిన సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ సినిమాలు అక్కడ భారీ విజయాలను సాధిస్తాయన్న విషయం తెలిసిందే. తాజాగా నయనతార మరో హారర్ థ్రిల్లర్ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఆమె ప్రధాన పాత్ర చేసిన హార్రర్ థ్రిల్లర్ ‘ఐరా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ చిత్రంలో దెయ్యాలు ఉన్నాయని నమ్మించడానికి ప్రయత్నించిన నయనతార… ఎలాంటి ఇబ్బందులు పడింది, వాటిని ఎలా ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ కథ కొనసాగుతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ లో “ఈ లోకంలో ఎవరూ ఇవ్వని సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు అభి… దానిని దూరం చేసిన ఎవరినీ నేను ప్రాణాలతో వదలను”, “నేనే మొదలు పెట్టాను… నేనే పూర్తి చేస్తాను” వంటి డైలాగ్స్ సినిమాపై రేకెత్తిస్తున్నాయి. నయనతార ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఈ నెల 28న విడుదల కానుంది. 

Related posts