రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. 1970ల కాలం నాటి కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఈ సినిమాలో నాని.. రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు.
తాజాగా ‘శ్యామ్‌సింగరాయ్’ టీజర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. అడిగే అండ లేదు కలబడే కండలేదు రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకుపుట్టి రాయడమే కాదు.. కాలరాయడం కూడా తెలుసనీ అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్ సింగ రాయ్అంటూ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది.
‘స్త్రీ ఎవడికీ దాసి కాదు. ఆఖరికి ఆ దేవుడికి కూడా. ఖబద్దార్’ అంటూ బెంగాలీలో నాని చెప్పిన డైలాగ్.. ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ ఆద్యంతం చూస్తుంటే సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఇందులోని నాని లుక్ అదిరిపోయింది.
ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందించగా, రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈనెల 24న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.