telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మంచువారి మసాలావడ రెడీ

లాక్‌డౌన్ సమయంలో ఇప్పటికే బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ నడుస్తుంది. ఇప్పుడు కుకింగ్ ఛాలెంజ్ కూడా వచ్చేసింది. తాజాగా టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మోహన్‌ బాబు కూడా ఈ కుకింగ్‌ ఛాలెంజ్‌ స్వీకరించాడు. తన స్పెషల్‌ మసాలా వడ వండి ప్రేక్షకులకు చూపించాడు కలెక్షన్ కింగ్. తోడుగా మనవరాలు విద్య నిర్వాణ ఉండగా ఆమెతో పాటు వడ రెడీ చేసాడు మోహన్ బాబు. కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి తనయ పింకీ రెడ్డి మోహన్‌బాబుకు కుకింగ్‌ ఛాలెంజ్‌ విసిరింది. దాన్ని స్వీకరించిన మోహన్ బాబు.. ఆమె కోసం స్పెషల్‌ మసాలా వడలను సిద్ధం చేసాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసాడు. ఈ వంటలో ఆయనకు మనవరాలు సాయం చేసింది. ఇద్దరూ కలిసి వడలు తినేసారు కూడా. ప్రస్తుతం మంచువారి మసాల వడ వీడియో వైరల్ అవుతుంది.

Related posts