అమెరికాలోని న్యూజెర్సీలో ఓ రెస్టారెంటులో సిబ్బంది కొరత ఏర్పడింది. అంతే తమ వద్ద ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటూ ఓ సైన్‌బోర్డు సిద్దం చేసిందా యాజమాన్యం. అయితే దానిలో ఓ పెద్ద నిబంధన విధించింది. అదేంటంటే ఆ ఉద్యోగాలు కేవలం మగవాళ్లకు మాత్రమేనంట. ఈ సైన్‌బోర్డు చూసిన చాలామందికి మహిళలకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు బ్లూమ్‌ఫీల్డ్ అనే ఆ రెస్టారెంటు యాజమాన్యానికి 1000 డాలర్లు (సుమారు రూ.70 వేలు) జరిమానా విధించింది. ఈ మొత్తం కట్టడానికి అంగీకరించిన ఆ రెస్టారెంటు మేనేజర్ ఆమిర్ అహ్మద్.. తాను మహిళా ఉద్యోగులకు వ్యతిరేకిని కానని చెప్పాడు. త్వరగా ఎవరో ఒకరిని పనిలోకి తీసుకోవాలనే తొందరలో పొరబాటున అలా ప్రకటన ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో ఫేస్‌బుక్ వేదికగా కూడా క్షమాపణలు చెప్పిందా రెస్టారెంటు యాజమాన్యం.
బీజేపీ ఎంపీ సోయం మాట తప్పారు: ఎమ్మెల్యే జోగు రామన్న