తెలుగులో యమదొంగ, చింతకాయల రవి లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది మమతా మోహన్ దాస్. నటిగానే కాకుండా గాయినిగాను ఈ అమ్మడు గుర్తింపు తెచ్చుకుంది. యమదొంగ చిత్రంతో మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆలాగే వెంకటేష్ సరసన చింతకాయల రవి చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిమెప్పించింది. ఆ తర్వాత కొన్ని కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ మమతా మోహన్ దాస్ కు సక్సెస్ దక్కలేదు. 2009లో వచ్చిన కేడి తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు ఈ చిన్నది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళంలో విక్రమ్, ఆర్య కలిసి నటిస్తున్న ‘ఎనిమి’ చిత్రంలో మమతా మోహన్ దాస్ నటిస్తోంది. మృణాళినీ రవి కూడా మరో లీడ్ రోల్ ప్లే చేస్తోందీ సినిమాలో. ఇటీవల మమతా మోహన్ దాస్ బెహ్రైన్ లో హార్లీ డేవిడ్ సన్ బైక్ ను అలవోకగా నడిపేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి పదిహేనేళ్ళ క్రితం మమతా మోహన్ బెంగళూరు వీధుల్లో ఎంచక్కా బైక్ నడిపేదట. కానీ సినిమా స్టార్ అయిన తరవాత అలాంటి ఛాన్స్ ఆమెకు దక్కలేదట. అయినా ఆనాటి డ్రైవింగ్ మెళకువలను ఇప్పటికీ మర్చిపోలేదని, అప్పటిలానే బైక్ ను రైడ్ చేశానని చెప్పింది మమతా మోహన్ దాస్. ఆ వీడియోను ఇన్ స్టాలోనూ పోస్ట్ చేయడంతో అభిమానులు మమతా డేరింగ్ డ్రైవింగ్ నేచర్ ను అప్రిషియేట్ చేస్తున్నారు.
							previous post
						
						
					

