‘గబ్బర్‌సింగ్’ కాంబినేషన్ రిపీట్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చేసింది. పవన్ కల్యాణ్, హరీష్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గబ్బర్ సింగ్ విడుదలై 8 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ‘ఇప్పుడే మొదలైంది’ అని ట్వీట్ చేసిన హరీష్ శంకర్.. తమ సినిమాపై ఫ్యాన్స్‌కి అప్‌డేట్ ఇచ్చారు. కాగా పవన్ 28వ చిత్రంగా తెరకెక్కబోతోన్న ఈ మూవీలో అతడి సరసన హీరోయిన్‌గా మలయాల కుట్టీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మాలీవుడ్‌కు చెందిన మానసా రాధాకృష్ణన్ అనే హీరోయిన్‌ను పవన్ కోసం ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఆమె బయోగ్రఫీని సెర్చ్ చేసిన పవన్ ఫ్యాన్స్.. మానసా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మానసా పేరు, లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే సినిమా టీం స్పందించాల్సిందే.
previous post

