• మహానాడు…ఇది పసుపు పండుగ
• జై తెలుగు దేశం…..జై తెలుగు దేశం….జై తెలుగు దేశం…జోహార్ ఎన్టీఆర్!
• ప్రతిపక్షంలో ఉన్నా…అధికారంలో ఉన్నా మహానాడు అంటే…అదే జోరు…అదే హోరు…
• రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగానే ఉండేది…ఇప్పుడు తొలిసారి దేవుని గడపలో…అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి మహానాడును కడపలో చేస్తున్నాం.
• ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తుంటే….ఎన్నికలు అయ్యి ఏడాది అవుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం తగ్గలేదు అని అర్ధం అవుతోంది.
• ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గానూ.. ఏడు స్థానాలను గెలిచాం…మన సత్తా చాటాం. వచ్చే సారి ఇంకొంచెం గట్టిగా పనిచేద్దాం.ఆ రెండూ మూడూ కూడా కొట్టి అన్ని చోట్లా జెండా ఎగరేద్దాం
• రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈ సారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ….వారికి ధన్యవాదాలు తెలిపేందుకే కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు దుమ్ములేపారు.
• పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు
• 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతంపైగా స్ట్రయిక్ రేట్, 57 శాతం పైగా ఓట్ షేర్ తో కొత్త చరిత్ర ను సృష్టించాం. దీనికి ముమ్మాటికీ కారణం పసుపు సైనికులే.
• మీరు చేసిన పోరాటాలే నేటి ఈ అధికారం…మీ త్యాగాలే నేటి ఈ స్థానం.
• ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లనే నేడు మనం ఇక్కడ ఉన్నాం. నేనే కాదు…ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలి.
• 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో మరే పార్టీ ఎదుర్కోనన్ని సంక్షోభాలను పార్టీ ఎదుర్కొంది.
• అయితే పార్టీ పని అయిపోయిందిన్న ప్రతిసారీ కార్యకర్తలు మరింత గట్టిగా పోరాడారు.
• నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర, ఎన్నికలకు ముందు లోకేష్ చేసిన యువగళం వరకు…కార్యకర్తల్లో అదే పోరాటం, అదే స్ఫూర్తి.
• గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి భయంకరమైన వాతారవణం సృష్టించిందో తెలుసు.
• పాలన అంటే హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులు అని మార్చేశారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారు.
• దీన్ని ప్రశ్నించిన తెలుగు దేశం కార్యకర్తలను, నాయకుల ప్రాణాలు తీశారు.
• వేటాడారు….వెంటాడారు. అక్రమ కేసులతో అరెస్టులు చేశారు.
• ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి….గ్రామ స్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం….మన చంద్రయ్య పీక కోస్తుంటే కూడా జై తెలుగు దేశం అని అన్నాడే కానీ లొంగలేదు.
• ఇలాంటి కార్యకర్తలకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను. వారి ఏం చేసినా తక్కువే.
• ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరసువంచి పాదాభివందనం చేస్తున్నాను.
• మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం. సంక్షేమం చూస్తాం
• తెలుగు జాతి అజెండా…పసుపు జెండా
• దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి…కానీ ప్రజల జీవితాలను ఇంతగా ప్రభావితం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే…టీడీపీ ఒక్కటే అని నేను బలంగా ఎప్పుడైనా…ఎక్కడైనా చెప్పగలను.
• తెలుగు జాతి సంక్షేమం, అభివృద్ది మాత్రమే అజెండాగా 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతోంది.
• అటు తెలంగాణనుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు సంస్కరణలు, అభివృద్ది అంటే… తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు తరువాత అని చూడాల్సిందే. ఇది చరిత్ర చెప్పే వాస్తవం.
• సంక్షేమం-సంస్కరణలు-అభివృద్ది ఇలా ప్రతి దానికి టీడీపీనే ట్రెండ్ సెట్టర్…టీడీపీ పాలనే బ్రాండ్ అంబాసిడర్.
• పటేల్ పట్వారీ వ్యవస్ధ రద్దు నుంచి…ఆడబిడ్డలకు ఆస్తిహక్కు వరకు….
• బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీల వరకు…
• రెండు రూపాయిలకే కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు…రూ.30 పింఛను నుంచి రూ. 4000 పింఛను వరకు…
• వంట కష్టాలను దీపం పథకంతో తప్పించడం నుంచి….డ్వాక్రా సంఘాలతో సాధికారత వరకు….
• నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాల్లో సత్తా చాటే వరకు….
• రాయల సీమ రైతన్నలు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి….డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు…
• బడుగు వర్గాలు అధికారం కోసం ఎదురుచూసే రోజుల నుంచి…. శాసించే నేటి స్థితి వరకు….
• ఇలా ఒక్కటని కాదు…ఒక్క వర్గం అని కాదు…ఒక్క ప్రాంతం అని కాదు…
• ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు…పుట్టిన తరువాత….అని గీత గీసి చెప్పాల్సిందే.
• Clean, Vision, Positive politics:
• ఈ సందర్భంలో మన రాజకీయ విధానాల గురించి మరో సారి గుర్తుచేస్తున్నాను…
• Clean, Vision, Positive politics మన విధానం. రాష్ట్రం ఫస్ట్ అనేది మన సిద్దాంతం.
• ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేకంగా పోరాడాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం.
• ప్రజల ఆస్తులు, హక్కుల పరిరక్షణకు కట్టుబడి పని చేశాం. ఇకపైనా చేస్తాం.
• విజన్ తో భావితరాల భవిష్యత్ కు అవసరమైన పాలసీలు తెచ్చాం….పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచాం.
• నేడు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థులే నాయకులు.
• మనది MOST SUCCESS MODEL పాలనా విధానం అని గత చరిత్ర చెపుతోంది.
• ఈ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు..చెరిపేస్తే చెరిగేది కాదు. ప్రజల గుండెల్లో దృఢమైన ముద్ర మనం.
• తిరుగులేని శక్తిగా పార్టీ
• పార్టీ విధానాలు, ఆలోచనలు మనల్ని దేశంలోనే ప్రత్యేకంగా నిలిపాయి.
• నేడు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేంద్రంలో రాష్ట్రం పరపతి పెరిగింది. ఇది గర్వకారణం.
• అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును పార్టీ ఎప్పుడూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినియోగిస్తుంది. సొంత అవసరాలకు వాడలేదు. వాడుకోదు. ఇదీ తెలుగు దేశం పార్టీ చిత్తశుద్ది.
• మన పార్టీ విధానాలు, ఆలోచనలు…దేశంలో రాజకీయ పార్టీలకు ఒక బ్లూ ప్రింట్ గా నిలిచాయి.
• సామాజిక న్యాయం అనేది తెలుగు దేశం రాజకీయాల్లో తెచ్చిన అతిపెద్ద సామాజిక విప్లవం.
• అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంతో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చింది మనమే.
• 40 ఏళ్ల క్రితమే బిసిలను రాజ్యాధికారంలో టీడీపీ భాగస్వాములను చేసింది.
• ఇదే తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా మార్చింది. తరువాత కాలంలోనే దేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీల గురించి మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది.
• సంస్థాగతంగా దేశంలోనే బలమైన పార్టీ మన పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి…కోటి సభ్యత్వాలు నమోదు చేయడం అంటే చిన్న విషయం కాదు. మన దగ్గర్లో ఎవరూ లేరు.
• జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించింది.
• What AP Thinks Today…India Thinks Tomorrow అనేది అనేక సార్లు ప్రూవ్ అయ్యింది.
• విద్యుత్ సంస్కరణలు, ఓపెన్ స్కైపాలసీ, PPP విధానాల్లో మౌళిక సదుపాయాలు, ప్రజల వద్దకు పాలన, జవాబు దారీ వ్యవస్థ వంటి విధానాలను దేశానికి పరిచయం చేశాం.
• ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి…ప్రస్తుత టెక్నాలజీ యుగంలో, ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకువద్దాం.
• ఆ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడులో చర్చించి నిర్ణయాలు తీసుకుందాం.
• మరో 40 ఏళ్లు పార్టీ బలంగా నిలబడడానికి అవసరమైన ప్రణాళికను రూపొందిద్దాం. దీనిపై ఇప్పటికే లోకేష్ కొన్ని ఆలోచనలు చేస్తున్నాడు. వాటికి ఈ మహానాడులో తుదిరూపు ఇద్దాం.
• ఈ అంశాలపై లోతుగా చర్చిద్దాం….మీ అందరి అభిప్రాయాలతో ముందుకువెళదాం.
• అవినీతిపై చారిత్రాత్మక పోరాటాలు..నేడు కళ్ల ముందు నిజాలు:
• కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహణ ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరు అనే అపోహలు ఉన్నాయి. కానీ ఇది నిజం కాదు.
• తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో అవినీతిపై ఎన్నో పోరాటాలు చేసింది.
• మన పోరాటాలు వృధా కాలేదని అనేక సందర్భాల్లో స్పష్టం అయ్యింది.
• 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి…నిన్నటి విధ్వంస పాలన వరకు మరువలేని పోరాటాలు చేశాం.
• ఉమ్మడి రాష్ట్రంలో రాజా ఆఫ్ కరెప్షన్ పేరుతో లక్ష కోట్ల అవినీతిపై తెలుగుదేశం చేసిన పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆ తరువాత కూడా తేల్చాయి. ఇదీ మన క్రెడిబిలిటీ.
• హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్, వాన్ పిక్, ఇందూ, లేపాక్షి భూములు, ఇదే కడప జిల్లాలో బ్రహ్మణి భూములు, సరస్వతీ భూములు, విశాఖలో బాక్సైక్ అక్రమాలపై అనేక పోరాటాలు చేశాం.
• ఓబులాపురం అక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే సంచలనం.
• ఓబులాపురం అక్రమాలు నిజమేనని ఇన్నేళ్ల తరువాత కోర్టులు కూడా గుర్తించాయి. నిందితులకు శిక్షలు వేశాయి. మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ల ముందు కనిపిస్తోంది.
• గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే… వైసీపీ ప్రభుత్వం అక్రమాలు మరో ఎత్తు.
• ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకులను ప్రజలు తరిమేశారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యతలను మనకు ఇచ్చారు. దీన్ని చట్టబద్దంగా నెరవేరుద్దాం.
• విధ్వంస పాలకుల స్కాంల లెక్కలు తీస్తున్నాం. ప్రజా సంపద దోచిన వారిని, గాడి తప్పిన నాయకులను, అధికారులను క్షమించే ప్రసక్తే లేదు.
• ఏడాదిలో ఎన్నో విజయాలు..ఒక్కో ఇటుకా పేర్చుతూ ముందుకు:
• మనం అధికారం చేపట్టి ఏడాది కావస్తోంది. ఏడాది క్రితం రాష్ట్రం సంక్షోభంలో ఉంది.
• ఉద్యమ స్ఫూర్తితో, అద్బుత చైతన్యంతో ప్రజల పట్టం గట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని…బాధ్యతగా భావించాం. ప్రతి రోజు, ప్రతి గంటా ప్రజల కోసం ఆలోచనలు చేశాం.
• అనుభవంతో, ఆలోచనతో కేంద్ర సహకారంతో, కూటమి పార్టీలైన బీజేపీ, జనసేనలతో సమన్వయంతో ఒక్కో ఇటుకా పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నాం.
• 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత దేశ ప్రజలు ఎంత స్వేచ్ఛను పొందారో…2024 ఎన్నికల తరవాత మన రాష్ట్ర ప్రజలు అంతటి స్వేచ్చను పొందారు.
• ప్రజల్లో నాటి అశాంతి పోయింది…ఎవరు ఏం చేస్తారో అనే అలజడిపోయింది. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. నేడు ప్రతి ఒక్కరు భద్రతతో, భరోసాతో బతుకుతున్నారు.
• ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది…భవిష్యత్ పై ఆశలు పెరిగాయి
• రోడ్లు, మౌళిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాథి, ఉద్యోగాలు, నోటిఫికేషన్లుతో ఏడాదిలోనే అనేక మార్పులు తెచ్చాం.
• నెలకు 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా దేశంలో గుర్తింపుపొందాం. కేవలం ఏడాదిలో రూ.33 వేల కోట్లు పింఛన్లుపై ఖర్చు చేశాం.
• అన్న క్యాంటీన్ లు, దీపం పథకంలో కోటి మంది లబ్దిదారులు, ఉచిత ఇసుక, మత్స్యకారులసేవలో ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్ లు, మౌజున్ లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం.
• ప్రజలకు భూతంలా మారిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం.
• ఇదే కాదు…మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కల్పించి… పెట్టుబడులు తెస్తున్నాం.
• రాయలసీమ అభివృద్ది పేటెంట్ టీడీపీదే:
• సమగ్రాభివృద్ది మన విధానం. అయితే వెనుకబడిన ప్రాంతాలపై ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
• సాగునీరు ఇవ్వడం ద్వారా సీమలో స్థితిగతులు మార్చాలని మొదట ఎన్టీఆర్ సంకల్పం చేశారు. వెనుకబడిన రాయలసీమపై ప్రాంతంపై ఎన్టీఆర్ ఎక్కువ శ్రద్ద పెట్టారు.
• అభివృద్దిపై దూరదృష్టితో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఫ్యాక్షన్ ను అంతం చేశాం.
• తెలుగుగంగ, కెసి కెనాల్ అభివృద్ది, హంద్రీనీవా, గాలేరు – నగరి, ముచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవే. సీమకు నీళ్లుతెచ్చిందే టీడీపీ అని గర్వంగా చెపుతా.
• 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయిల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ పద్దతి తెచ్చాం. డ్రిప్ తో సీమ సీను మార్చాం.
• రూ.12 వేల కోట్లకు పైగా నిధులను నాడు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టాం.
• కడప, కర్నూలు ఎయిర్ పోర్టులను నిర్మించాం. అనంతకు కియా కార్ల పరిశ్రమ తెచ్చాం.
• రాయలసీమ రైతులు జీవితాలు పండించే పోలవరం-బనకచర్ల ను నాంది పలుకుతున్నాం.
• కడప జిల్లా కొప్పర్తి, కర్నూలులో ఓర్వకల్ పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం.
• అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దితోనే నిజమైన స్వర్ణాంధ్ర సాధ్యం అవుతుంది.
• కార్యకర్త మీసం మెలేసేలా పాలన:
• ఈ మహానాడు వేదికగా చెపుతున్నా….ప్రతి కార్యకర్త గర్వపడేలా పాలన అందిస్తాం.
• మీకు ప్రజల్లో గౌరవాన్ని పెంచుతాం. గ్రామాల్లో మీరు మీసం మెలేసేలా చేస్తాం
• సూపర్ సిక్స్ హామీలు అన్నీ అమలు చేస్తాం. ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం.
• కూటమి గా మన మూడు పార్టీలు కలిసి నడవాలి…మనం కలిసి గెలవాలి…
• తెలుగు జాతి నెంబర్ 1 కావాలంటే…….తెలుగుదేశం ముందుడాలి.
• దాని కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలి. ఈ మహానాడు చారిత్రాత్మకం….కడపకు మరింత ప్రత్యేకం.
• జై తెలుగు దేశం… జోహార్ ఎన్టీఆర్