ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మారోసారి విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా ఆదరించాలని ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వం, హిందూ మత సంస్థలు, ఆస్తులు, కార్యక్రమాలపై ఎందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది? అని ప్రశ్నించారు.
ప్రణాళికాబద్ధంగా కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని, అటువంటి ధర్మాన్నే భక్షించాలని చూస్తే బీజేపీ ఎటువంటి పోరాటానికైనా సిద్ధమేనని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.